మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన‌ క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్: చిరంజీవి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నాకు అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తిగా క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌.. నా మ‌న‌సులో స్థానం ఎప్ప‌టికీ ప‌దిల‌మ‌ని చిరంజీవి అన్నారు. స్వ‌ర్గీయ కె.విశ్వ‌నాథ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆదివారం న‌గ‌రంలో ‘క‌ళాత‌ప‌స్వికి క‌ళాంజ‌లి’ పేరుతో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, ‘విశ్వ‌నాథ్’ ద‌ర్శ‌క‌త్వంలో నటించిన న‌టులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు హాజ‌ర‌య్యారు. విశ్వ‌నాథ్‌గారితో ఉన్న త‌మ‌ జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజ‌రయ్యారు.  ఆయ‌న మాట్లాడుతూ.. కె.విశ్వ‌నాథ్ నాకు గురువు అని.. సునిశితంగా న‌టించ‌డం ఆయ‌న్నుంచే నేర్చుకున్నాన‌ని అన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర నుండి నేను సెంటిమెంట్ నేర్చుకున్నాన‌ని చిరంజీవి అన్నారు. విశ్వ‌నాథ్ గారి దగ్గ‌ర నేర్చుకున్న‌ది యంగ్‌స్ట‌ర్స్‌కు చెబుతూ ఉంటాన‌ని అన్నారు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లి తెలుగుజాతి గ‌ర్వ‌ప‌డేలా చేసిన దిగ్ధర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ అని అన్నారు.

శ్రుతిల‌య‌లు సినిమాలో న‌టించిన అల‌నాటి హీరోయిన్ సుమ‌ల‌త మాట్లాడుతూ.., సినిమాల‌లో హీరోయిన్స్‌కి ఘ‌ట్స్ ఉన్న క్యారెక్ట‌ర్ ఉండేద‌ని.. women were not just an arnament అని సుమ‌ల‌త అన్నారు. లేడీ కారెక్ట‌ర్‌ని స్ట్రంగ్ గా చూపించేవార‌న్నారు.

పాన్ ఇండియా సినిమాకు పునాదులు వేసిన క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ అని ఆర్ నారాయ‌ణ‌మూర్తి అన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి అల‌నాటి క‌థానాయిక‌లు.. ద‌ర్శ‌కులు కె. విశ్వ‌నాథ్ సినిమాల‌లో న‌టించిన హీరోయిన్స్‌ జ‌య‌సుధ, సుమ‌ల‌త‌, రాధిక, శంక‌రాభ‌ర‌ణం ఝాన్సీ, మంజు భార్గ‌వి, రాజ్య‌లక్ష్మి, మీనా, ఆమ‌ని, మంజ‌రి హాజ‌ర‌య్యారు.

1 Comment
  1. 홈타이 says

    I am really impressed with your writing skills and also with the
    layout on your weblog. Is this a paid theme or did you modify it yourself?
    Anyway keep up the nice quality writing, it is rare to see a nice blog like this one today.

Leave A Reply

Your email address will not be published.