వివాహానికి క‌నీస వ‌య‌సుపై నిర్ణ‌యం పార్ల‌మెంటుదే: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): కోర్టులు చ‌ట్టాలు చేయ‌వ‌ని.. కొన్ని విష‌యాల‌ను పార్ల‌మెంట్ మాత్ర‌మే నిర్ణ‌యిస్తుంద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. స్త్రీ, పురుష వివాహ‌ వ‌య‌సుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ ను ప‌రిశీలించిన ధ‌ర్మాస‌నం.. ఈ విష‌యంలో చ‌ట్టం చేయాలంటూ పార్ల‌మెంట్‌కు కూడా ఆదేశాలు జారీ చేయ‌లేమ‌ని తెలిపింది. దేశంలో స్త్రీ, పురుష వివాహ‌ వ‌య‌సు ఒకే విధంగా ఉండాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిని ప‌రిశీలించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డి వై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం.. కోర్టులు చ‌ట్టాలు చేయ‌లేవంటూ కీల‌క వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేసింది.

. స్త్రీ, పురుష వివాహ‌ వ‌య‌సు ఒకేలా ఉండాల‌ని.. మ‌హిళ వ‌య‌సు కూడా 21కి పెంచాల‌ని న్యాయ‌వాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని ప‌రిశీలించిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం.. రాజ్యాంగానికి మ‌న‌మే ప్ర‌త్యేక సంర‌క్ష‌కుల‌మ‌ని భావించ‌కూడ‌దు. ఇక్క‌డ మ‌న‌కు చ‌ట్టాలు రూపొందించ‌లేమ‌ని.. పార్ల‌మెంట్ ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

 

Leave A Reply

Your email address will not be published.