నకిలీ విత్తనాలు అమ్మిన, రవాణా చేసినా క‌ఠిన చ‌ర్య‌లు

ఇన్ఛార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో అవ‌గాహ‌న స‌ద‌స్సు

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఇన్ఛార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి విత్తన డీలర్లు, యజమానులకు, ట్రాన్స్‌ఫోర్ట‌ర్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, నిషేధిత గడ్డి మందు విక్రహిస్తే ఉపేక్షించ‌మని అన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మితే పీడీ యాక్టులు నమోదుచేసి జైలుకు పంపిస్తామని, విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

రైతులను మోసం చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు వస్తున్నాయనే సమాచారం ఉందన్నారు. హెచ్ టి కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన విత్త నాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు డీలర్ల నుండి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆమోదించిన పత్తి విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని తెలియజేయాలని తెలిపారు .

ఈ సమావేశంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, ఎస్సైలు, ఫెర్టిలైజర్ షాపుల యజమానులు మరియు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.