ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే.. విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
నిజామాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిఆర్ ఎస్ నాయకులు, అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పొతంగల్ గ్రామంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు గాను గ్రామంలోని 80 మందికి తెలంగాణ జాగృతి సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అభాగ్యులకు అండగా నిలిచే కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆమె చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్ సాగర్, నిజామాబాద్ జాగృతి అధ్యక్షురాలు అవంతి రావు, టిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తారిక్ అన్సారీ జెడ్పి ఛైర్మన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.