త‌మ‌దే అనుకొని వేరే బైకులో రూ. 2.80 ల‌క్ష‌లు..

పుట‌ప‌ర్తి (CLiC2NEWS):త‌మ బైకే అనుకొని వేరే బైక్‌లో రూ. 2.80 ల‌క్ష‌ల న‌గ‌దును పెట్టేశాడు. త‌ర్వాత డిక్కి తెరిచి చూసి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. పుటప‌ర్తి ప‌ట్ట‌ణంలో పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెనుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన డైవ‌ర్ ప్ర‌సాద్ ఎనుమ‌ల‌పల్లికి చెంద‌ని శ్రీ‌రాములుకు రూ. 2.80 ల‌క్ష‌లు అప్పు ఇచ్చాడు. డ‌బ్బు తిరిగి చెల్లించే క్ర‌మంలో పొర‌బాటున శ్రీ‌రాములు త‌మదే అనుకొని వేరే స్కూటీలో న‌గ‌దు పెట్టేశాడు. ఇంటికి వెళ్లిన త‌ర్వాత ప్ర‌సాద్‌కు న‌గ‌దు క‌నిపించ‌క‌పోయే స‌రికి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. పోలీసులు సిసి పుటేజీల ఆధారంగా న‌గ‌దు ఉన్న స్కూటీని గుర్తించారు. వెంట‌నే న‌గ‌దును స్వాధీనం చేసుకొని ప్ర‌సాద్‌కు అప్ప‌గించారు.

Leave A Reply

Your email address will not be published.