దెబ్బతిన్న కిడ్నీకి బదులుగా.. బాగున్న కిడ్నీ తొలగించిన వైద్యులు

జైపుర్ (CLiC2NEWS): కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స చేసి బాగున్న కిడ్నీని తొలగించారు వైద్యులు. దీంతో ఆ మహిళ సమస్య తీరక పోగా మరింత ఎక్కువైంది. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని ఝంఝు జిల్లాలో చోటు చేసుకుంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రికి వచ్చిన మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. దెబ్బతిన్న కిడ్నీకి బదులుగా.. బాగున్న కిడ్నీని తొలగించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆరోగ్యం పరిస్తితి మెరుగవకపోవడంతో మరో ఆప్పత్రికి వెళ్లగా.. అక్కడ పరీక్షలు నిర్వహించిగా జరిగిన తప్పిదం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టింది. క్లినికల్ లైసెన్స్ రద్దు చేశారు.