మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ!
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/MANIPUR.jpg)
ఇంఫాల్ (CLiC2NEWS): ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. జాతుల మధ్య చెలరేగిన ఘర్షణ రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. శనివారం నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపులు గుంపులుగా ఏర్పడి.. అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ వద్ద నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఈ గుంపులలో దాదాపు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. మణిపుర్ విశ్వవిద్యాలయం సమీపంలో ఓ ఎమ్ ఎల్ ఎ ఇంటి వద్ద కూడా నిరసనకారులు ఇదే తరహాలో యత్నించినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 300 నుండి 400 మంది గుంపులుగా వచ్చి.. ఇంఫాలో సమీపంలోని ఇరింగ్ బామ్ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను దొంగిలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఆర్మీ, అస్సాం, రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగా సంయుక్తంగా ఈ దాడుల్న భగ్నం చేశారు.
ఇంఫాల్‌లోని కేంద్ర మంత్రి ఆర్.కె. రంజన్ సింగ్ ఇంటిపై కూడా నిరసనకారులు మూకదాడి చేశారు. పెట్రోల్ బాంబులు విసిరి ఇంటిని భస్మం చేసేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డులు, అగ్ని మాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఓ విశ్రాంత గిరిజన ఐఎఎస్ అధికారికి చెందిన గిడ్డంగికి నిప్పంటించారు.