నాభార్యే నన్ను నదిలోకి తోసేసింది..!
రాయచూరు (CLiC2NEWS): కృష్ణా నది బ్రిడ్జిపై నుండి ఓ యువకుడు నదిలో పడిపోయాడు. గమనించిన వాహనదారులు అతనిని ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరిన ఆ యువకుడు చెప్పిన సమాధానంతో షాకవ్వడం వాహనదారుల వంతైంది. నాభార్యే నన్ను నదిలోకి తోసేసిందని తెలిపాడు. ఈ ఘటన కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో రాయచూరు తాలూకా గుర్జాపుర్ వంతెన వద్ద చోటుచేసుకుంది.
కార్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తి నగర్‌కు చెందిన తాతప్పకు సుమంగళితో మూడు నెలల క్రితం వివాహమైంది.ఇద్దరూ కలిసి బయటకు వెళుతూ.. గుర్జాపూర్ వంతెన వద్ద సెల్ఫీ దిగుదామని సమంగళి అడగగా.. బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరూ కవర్ అయ్యేలా ఫోటో తీయడానికి తాతప్ప ప్రయత్నించగా నదిలో పడిపోయాడు. అతనికి ఈత రావడంతో ఈదుకుంటూ పైకి రావడానికి ప్రయత్నించగా.. వాహనదారులు అతడిని తాళ్ల సాయంతో రక్షించారు. వంతెనపైకి చేరుకున్న తాతప్ప.. నువ్వే నన్ను తోసేశావు అని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను తోయలేదని.. ప్రమాదవశాత్తూ పడిపోయావు అని భార్య వాదించింది. పెళ్లయినప్పటి నుండీ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.