నిరాహార దీక్ష.. క్షీణించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం!
పట్నా (CLiC2NEWS): ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నాలుగు రోజుల నుండి నిరాహార దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. ఇటీవల బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సోమవారం పోలీసులు భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కిశోర్‌ని బెయిల్‌పై విడుదల చేశారు. సోమవారం రాత్రి ఆయన జైలు నుండి విడుదలైనట్లు సమాచారం.
జనవరి 2వ తేదీన గాంధీ మైదానంలో జన్ సురాజ్ పార్టి వ్యవస్థాపకుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో ఎటువంటి మార్చు రావటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నిర్వహించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు.