BCCI: సునీల్ గావస్కర్‌కు అరుదైన సత్కారం..
ముంబయి (CLiC2NEWS): భారత మీజి క్రికెటర్ సునీల్ గావస్కర్‌ను వినూత్నంగా సత్కరించింది బిసిసిఐ. టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలు రాయిని దాటిన తొలి క్రికెటర్ గావస్కర్. 1971-87మధ్య టీమ్ ఇండియాకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 125 టెస్టుల్లో 10,122 పరుగులు చేశారు. ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో గావస్కర్ గౌరవార్థం ప్రత్యేక బోర్డ్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ రూమ్‌కు 10,000 గావస్కర్ అని నామకరణం చేసింది. ఈ బోర్డ్ రూమ్‌ను సునీల్ గావస్కర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసిఎ, బిసిసిఐ నా తల్లిదండ్రుల లాంటివన్నారు. ఇది గొప్ప గౌరవమని.. భారత క్రికెట్ వలనే ఈ గుర్తింపు దక్కిందన్నారు. తనను ఈ విధంగా సత్కరించినందుకు బిసిసిఐకి కృతజ్ఞతలు తెలియజేశారు.