సంగారెడ్డి: నడిరోడ్డుపై తల్లీ కుమారుడి దారుణ హత్య
సంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలో తల్లీకుమారుడు దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఇద్దరినీ కత్తితో పొడిచి హతమార్చాడు. తన రెండున్నరేళ్ల కొడుకు మరణానికి వారే కారణమని భావించి , కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. మరణించిన వారు సరోజాదేవి, అనిల్‌గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.