మా ప్లాట్లను పెద్ద చెరువు మింగేసింది!: బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్ (CLiC2NEWS): అమీన్‌పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు కోల్పోయామని, ఎఫ్ ఎల్‌టి పెరగడంతో తమ ప్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని బాధితులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు చెరువు ఎఫ్ ఎల్‌టి, బఫర్ జోన్ లను కబ్జా చేశారని హైడ్రా కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. వింతగా ఈ సారి ఎఫ్ ఎల్‌టి పెరగడంతో తమ ప్లాట్లు పూర్తిగా మునిగిపోయాయని బాధితులంతా పది రోజులుగా చెరువు కట్టపై జెసిగా ఏర్పడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.