రూ. 500 గ్యాస్ బండ.. రేషన్ కార్డు ఆధారంగా లబ్దిదారుల ఎంపిక!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వందరోజుల లోపల అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్ (ఆహార భద్రత) కార్డు ఉన్న వారినే లబ్థిదారులగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం. రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.