పెండింగ్ బిల్లులు విడుద‌ల చేయాలి: మాజి స‌ర్పంచ్‌లు

హైద‌రాబాద్  (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మాజి స‌ర్పంచ్‌లు పోరుబాట ప‌ట్టారు. పెండింగ్ బిల్లులు విడుద‌ల చేయాలని సిఎం రేవంత్ రెడ్డికి విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు న‌గ‌రానికి చేరుకున్నారు. వారంతో ఓ హోట‌ల్‌లో స‌మావేశ‌మ‌య్యారు. హోట‌ల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టిన వారిని పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై  బిఆర్ ఎస్ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ స్పందించారు. మాజి స‌ర్పంచులు ఏడాదిగా తిరుగుతున్నార‌ని.. వారి కుటంబాల‌ను రోడ్డున ప‌డేయ‌డం దారుణ‌మ‌న్నారు. శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సిఎంను క‌లిసేందుకు వ‌చ్చిన వారిని అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామికమ‌ని మాజి మంత్రి , బిఆర్ ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.