నగరంలో వారం కిందట అదృశ్యమైన అమ్మాయి.. మృతదేహం లభ్యం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో వారం రోజుల క్రితం ఓ అమ్మాయి అదృశ్యమైనట్లు తల్లిదండ్రలు ఫిర్యాదు చేశారు. నవంబర్ 10న మియాపూర్లో అమ్మాయి కనిపించడం లేదని అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తుక్కుగూడలోని ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి కి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.