యాదాద్రి శివాలయ ఉద్ఘాటనలో పాల్గొన్న కెసిఆర్ దంపతులు

యాదాద్రి (CLiC2NEWS): శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబందంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆద్ఘాటన మహక్రతువును వైభవంగా నిర్వహించారు. సిఎం కెసిఆర్ సతీ సమేతంగా ఈ క్రతువులో పాల్గొన్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనకు ఐదు రోజులులగా ఆగమశాస్త్ర రీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్ఘాటన సర్వాలు పూర్తైన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.