ఫీల్డ్ అసిస్టెంట్‌లకు గుడ్‌న్యూస్: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ ఫీల్డ్ అసిస్టెంట్‌లకు శుభవార్త చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సభలో సిఎం కెసిఆర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలాంటి పొరపాటు చేయొద్దని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.
ఇరిగేషన్ విభాగంలోకి విఆర్ఎలు
విఆర్ ఎలను ఇరిగేషన్ విభాగంలోకి తీసుకుంటామని సిఎం తెలిపారు. వారికి స్కేల్ ఇచ్చి లష్కర్ పోస్టులోకి తీసుకుంటాం. కాల్వల నిర్వహణ కోసం లష్కర్‌లు పనిచేస్తారు. వీరిలో చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారున్నారు. వారు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఎస్సి, ఎస్టి, ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఆలస్యం చేయబోయేది లేదు అని సిఎం వివరించారు.