త్వరలో సూర్యాపేటకు ఐటి హబ్..
కాలిఫోర్నియాలో ప్రకటించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్వరలో ఐటి హబ్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ప్రణాళికలు రెడీ అవుతున్నాయని తెలిపారు. దీని కోసం గ్లోబల్ ఐటి సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.