ఇంట్లో నుండి బీరువా, న‌గ‌దును ఎత్తుకెళ్లిన దుండ‌గులు

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి ప‌ట్ట‌ణ శివారులోని పాత ఎస్‌పిఆర్ కాల‌నీలో సోమ‌వారం దొంగ‌త‌నం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ ఇంటి నుండి న‌గ‌దుతో పాటు బీరువాను సైతం ఎత్తుకెళ్లిన‌ట్లు స‌మాచారం. సిసి కెమెరాల్లో రికార్డు అయిన పుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వీలైనంత తొంద‌ర్లోనే దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటామ‌ని దేవునిప‌ల్లి ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు.

 

ఎల్లుండి మే నెల‌ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల విడుద‌ల‌

రాష్ట్రంలోని రైతుల‌కు శుభ‌వార్త‌

Leave A Reply

Your email address will not be published.