మంచిర్యాల: ఆ పరమేశ్వరుడికి అన్నపూజ
మంచిర్యాల (CLiC2NEWS): పట్టణంలోని రాంనగర్ నందు కొలువైన మార్కండేయ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అందులోనూ శ్రావణమాసం కావున స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. అన్నంతో స్వామివారిని అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి తరించారు.
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు