మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుతో మరో 14 పూర్తి చేయవచ్చు: ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్ (CLiC2NEWS): మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చవతుందని.. ఆ ఖర్చుతో ప్రాణహిత పూర్తి చేస్తే సరిపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ మూడు బ్యారేజిలకు అంత ఖర్చుపెట్టినా వరద ఉద్ధృతికి కొట్టుకుబోపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. ఆ ప్రాజెక్టులు తీసేయడం వల్ల రూ.10వేల కోట్లు నష్టం వస్తుందని.. వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు.
3 ప్రాజెక్టులపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ఆ బ్యారేజిలకు మరమ్మతుతుల చేసే బదులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గోదావరిపై 14 చిన్న ప్రాజెక్టుఉల పూర్తి చేయాలన్నారు. తెలంగాణను సంప్రదించకుండా ఎపి సిఎం చంద్రబాబు ప్రాజెక్టులు చేపడుతున్నారని.. బనకచర్ల ప్రాజెక్టును ఆపేయాలన్నారు. నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల సిఎంలు కూర్చొని బనకచర్లపై మాట్లాడుకోవాలన్నారు. అంతేకాకుండా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కోరారు.