వరంగల్: యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు.. 18 మంది ఆరెస్టు
వరంగల్ (CLiC2NEWS): వరంగల్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టానుసారంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు ఆరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులుకు అందిన సమాచారం మేరకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు రూ. 73 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లోటస్ హాస్పిటల్ యజమాని, డాక్టర్స్‌ను అరెస్టు చేశారు. ఆయుర్వేద వైద్యుల సైతం గర్భస్రావాలు చేస్తున్నట్లు సమాచారం. గర్భస్రావం చేయడానికి రూ. 30వేలు వసూలు చేస్తున్నట్లు.. నర్సంపేట కేంద్రగా ఈ దందా కొనసాగుతుందని సిపి పేర్కొన్నారు.