బాసర ఆర్‌జియుకెటిలోని విద్యార్థులతో భేటీ కానున్న రాష్ట్ర గవర్నర్..
బాసర (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర ఆర్‌జియుకెటిలోని విద్యార్థులతో భేటీ కానున్నారు. ముందుగా బాసర సరస్వతీ అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం గవర్నర్ ఆర్‌జియుకెటికి వెళ్లి విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల ఆర్‌జియుకెటిలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసినదే. కలుషిత ఆహార ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు రాత్రి భోజనం చేయకుండా ఆందోళనకు దిగారు. కలుషిత ఆహారంకు సంబంధించిన నమూనాలను పరీక్షలకు పంపారు కానీ.. నివేదికలోని విషయాలను ఎందుకు బహిరంగ పరచడం లేదో చెప్పాలన్నారు. మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేస్తామని చెప్పారు కానీ.. అమలు కాలేదని విద్యార్థులు తెలిపారు. కలుషిత ఆహార ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందని సిబ్బంది రాజీనామా చేస్తామన్నారు. ఇప్పటివరకూ ఎటువంటి రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు.