కెసిఆర్ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు: కాంట్రాక్టు ఉద్యోగులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ శాస‌న‌స‌భ‌లో 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్ధీక‌రిస్తామ‌ని తీసుకున్న నిర్ణ‌యానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాంట్రాక్టు వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేస్తున్న జూనియ‌ర్ క‌ళాశాల , డిగ్రీ క‌ళాశాల‌, పాలిటెక్నిక్ క‌ళాశాల, రెసిడెన్షియ‌ల్ కాలేజిసంఘాల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయ‌కులు, ఉపాధ్యాయులు సిఎం కెసిఆర్‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు తెలంగాణ రైతు బంధు స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. త్వ‌ర‌లో రాష్ట్ర స్థాయి ధ‌న్య‌వాద స‌భ‌ను ఏర్పాటు చేసి సిఎంకు కృత‌జ్ఞ‌తలు తెలుపుతామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంట్రాక్టు డిగ్రీ కాలేజ్ లెక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్ష‌డు వినోద్ ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.