AP: ఘనంగా తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులకు అభిమానులు ఉన్నారని ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది కె.చిదంబరం, హైకోర్టు న్యాయవాదుల సంఘం నాయకులు, సీనియర్ న్యాయవాది వి.సాయికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలను హైకోర్టు న్యాయ వాదులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. తోట త్రిమూర్తులు ఒక పెద్ద న్యాయవ్యవస్థ అని అన్నారు. ఆయన వద్ద సాంఘిక న్యాయం, సమ న్యాయం జరుగుతుందని తెలిపారు. కోస్తాజిల్లాలో సామాన్యుడు ఆయనకు ఫోన్ ద్వారా తన కష్టాలు చెప్పుకుంటే నిమిషాల్లో వారికి న్యాయం జరుగుతుందన్నారు.

న్యాయవాది ఈర్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల ఆయనకు నియోజకవర్గంలో జడ్ మేడపాడు గ్రామంలో ముస్లింలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తే వారి ఇంటిని కూలగొట్టకుండా కాపాడారని అన్నారు. సామాజిక న్యాయానికి, నిరు పేదల సంక్షేమానికి తోట త్రిమూర్తులు చేస్తున్న సేవలను హైకోర్టు న్యాయవాదులు రావుల నాగార్జున, పచ్చా షణ్ముత, పొన్నూరు చేతన్, ఎన్ఎస్వి రవితేజ తదితరులు కొనియాడారు.
-టి. గోవిందరావు
సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది
సెల్: 98850 01925