యాదాద్రిలోని విల్లాకు రూ. 7.50కోట్ల విరాళం..
భువనగిరి (CLiC2NEWS): యాదాద్రి లోని వివిఐపిల బస కోసం 14 విల్లాలు నిర్మించారు. వీటిలోని ఒక విల్లాకు కాటూరి వైద్యకళాశాల యజమాని కాటూరి సుబ్బారావు రూ. 7.50 కోట్లను విరాళం ఇచ్చారు. బాలాలయంలోని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం విరాళం చెక్కును వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీతకు అందజేశారు. ఆలయ ఈఓ ఆయనకు విల్లా తాళం చెవి అందించారు.