అమెరికాలో మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగంతం..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రానికి భారీగా పెట్టుబుడలు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. లాస్ ఎంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, పలువురు ఎన్నారైలు ఘనస్వాగతం తెలిపారు. మంత్రి వారందరితో కొంతసేపు మాట్లాడారు. తెలంగాణ అభివీద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించి వివరాలను తెలిపారు. ఎన్నారైలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. మంత్రితో పాటు టిఆర్ ఎస్ ఎన్నరారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఉన్నారు.