ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ (CLiC2NEWS): శరన్నవరాత్రులలో భాగంగా ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గ అమ్మవారు గురువారం దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఐదు వరుసల్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.