ఏకాగ్ర‌త కోసం వృక్షాశనం..

వృక్షాశనం చేయు విధానం.. వృక్షాసనమంటే నిలబడి ఉండే భంగిమ. ఈ భంగిమ చెట్టు లా ఉంటుంది గనుక దీన్ని వృక్షాశనం అని అంటారు.

ముందుగా రెండు పాదాలు కలిపి నిటారు నిలబడవలెను.
చూపు భూమికి సమాంతరంగా ఉండవలెను. ముందుగా శ్వాస తీసుకుని వదలాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ కుడి కాలుని మడిచి ఎడమ తొడ‌ లోపలి భాగములో కుడి పాదాన్ని ఉంచాలి. కుడి మడమ పెరినీయం తాకాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు అర చేతులు కలిపి నమస్కార స్థితిలో పైకి లేపి ఉంచవలెను.

ఈ భంగిమలో 15 నుంచి 30 నిమిషాల వరకు ఉండాలి. ఈ స్థితిలో శ్వాసను బంధించి ఉంచాలి. తర్వాత శ్వాస విడుస్తూ రెండు చేతులు కిందకు తీసుకొనిరాండి.మీ కుడి కాలునీ కూడా యధా స్థితికి తీసుకురావలెను. ఇలా ఎడమ కాలితో కూడా చేయవలెను.. దీనిని ధ్రువాసనం అని కూడా అంటారు.

దీనివల్ల ప్రయోజనాలు:
దీనివల్ల ఏకాగ్రత దొరుకుతుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది.మనసు యొక్క చంచలత్వాన్ని తొలగించును. స్నాయు మండలం Prabh పరిచి స్థిరత్వం కలిగించును.శరీరాన్ని సమతుల్యం చేస్తుంది.

-షేక్ బార్ అలీ
యోగాచార్యులు

 

Leave A Reply

Your email address will not be published.