న‌గ‌రంలో వాణిజ్య‌ న‌ల్లా బకాయిలు చెల్లించ‌క‌పోతే క‌నెక్ష‌న్ల తొల‌గింపు

రెవెన్యూ పెంపుపై జ‌ల‌మండ‌లి మ‌రింత‌ ఫోక‌స్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): జ‌ల‌మండ‌లి వాణిజ్య(క‌మ‌ర్షియ‌ల్‌) న‌ల్లా క‌నెక్ష‌న్ల బ‌కాయిల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణయించింది. ఆరు నెల‌లు, ఆపై నుంచి న‌ల్లా బిల్లు చెల్లించని వాణిజ్య క‌నెక్ష‌న్ల బ‌కాయిల‌ను వ‌సూలు చేయాల‌ని, చెల్లించ‌క‌పోతే క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ అధికారుల‌కు సూచించారు. ఇందుకు గానూ రెవెన్యూ వ‌సూలు బృందాల‌కు స‌హాయ‌కంగా జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగ‌నున్నారు. కొన్ని మొండి బ‌కాయిలు వ‌సూల‌య్యాయ‌ని, ఆదాయం క్ర‌మంగా పెరుగుతోంద‌ని పేర్కొన్నారు. బ‌కాయిలు చెల్లించ‌డానికి వాణిజ్య వినియోగ‌దారులు సిద్ధ‌ప‌డ‌క‌పోతే క‌నెక్ష‌న్ తొల‌గించ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

గ‌త‌ ఆరు నెల‌లు, అంత‌కంటే ఎక్కువ రోజుల నుంచి బిల్లులు చెల్లించని వాణిజ్య‌ క‌నెక్ష‌న్ల వినియోగ‌దారులు మొత్తం 1095 ఉన్న‌ట్లు గుర్తించారు. వీరి ద‌గ్గ‌ర‌ నుంచి రూ.8.31 కోట్ల బ‌కాయిలు వ‌సూలు కావాల్సి ఉంది. కావున‌, ఆరు నెల‌లు, ఆపై బిల్లులు చెల్లించ‌ని వాణిజ్య క‌నెక్ష‌న్ల బ‌కాయిల విష‌యంలో క‌ఠినంగా ఉండాల‌ని ఆయ‌న అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

నాన్ ఫ్రీ వాట‌ర్ స్కీమ్(నెల‌కు 20 వేల లీట‌ర్ల ఉచిత తాగునీటి ప‌థ‌కానికి ద‌రఖాస్తు చేసుకోని)ప‌రిధిలో ఉన్న క‌నెక్ష‌న్ల‌ బ‌కాయిల‌పైన కూడా దృష్టి సారించాలని, ఈ బ‌కాయిల‌ను సైతం వ‌సూలు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇప్ప‌టికే వీరికి 13 నెల‌ల బిల్లుల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని, ఉచిత తాగునీటి ప‌థ‌కానికి ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి అనేక అవ‌కాశాలు ఇచ్చిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. వీరు ఇప్ప‌టికైనా ఉచిత తాగునీటి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఇప్ప‌టి నుంచి ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని, బ‌కాయిలు మాత్రం చెల్లిస్తే స‌రిపోతుంద‌ని పేర్కొన్నారు.

 

5 Comments
  1. fifa55 says

    Hello to every body, it’s my first pay a visit of this weblog; this weblog includes amazing and really
    excellent material in support of readers.

  2. pgslot says

    I am sure this paragraph has touched all the internet visitors,
    its really really pleasant post on building up new blog.

  3. jokerslots888 says

    Having read this I believed it was really enlightening.
    I appreciate you spending some time and energy to put this information together.

    I once again find myself spending a significant amount of time
    both reading and commenting. But so what, it was
    still worthwhile!

  4. nerds rope edible says

    Yes! Finally someone writes about wedding pie strain.

  5. Log in says

    Cool. I spent a long time looking for relevant content and found that your article gave me new ideas, which is very helpful for my research. I think my thesis can be completed more smoothly. Thank you.

Leave A Reply

Your email address will not be published.