హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మంచినీటిని సరఫరా చేస్తున్న పైప్‌లైన్‌లకు మర్మ్మత్తులు చేస్తున్న కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు. కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 3 రింగ్ మెయిన్-2కి సంబంధించి 1500 ఎంఎం డయా పైప్‌లైన్‌పైన నీటి లీకేజీని అరికట్టడానికి గానూ 400 ఎంఎం బటర్‌ఫ్లై వాల్వ్‌ను మార్చాల్సి ఉంది. కావున శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. కాబట్టి ఈ 12 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 రింగ్ మెయిన్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు–
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ పరిధిలోని ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 21 – సైనిక్‌పురి, అల్వాల్ పరిధిలోని ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మౌలాలి పరిధిలోని ప్రాంతాలు.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – లాలాపేట, తార్నాక పరిధిలోని ప్రాంతాలు.
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, చర్లపల్లి పరిధిలోని ప్రాంతాలు.