విద్యుత్ సంస్థల్లోని ఆర్జిజన్ల సమ్మె విరమణ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని నాలుగు విద్యుత్ సంస్థల్లోని ఆర్జిజన్ల సమ్మె విరమించినట్లు ఎంప్లాయ్స్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ట్రాన్స్‌కొ, జెన్‌కొ సిఎండి ప్రభాకర్ రావుతో చర్చల అనంతరం సమ్మె విరమించినట్లు తెలుస్తోంది. చర్చలు ఫలించి.. సమ్మె విరమిస్తున్నామని, సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్లు విధుల్లోకి హాజరుకావాలని సంఘం ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. తొలగించిన మొత్తం 200 మంది ఆర్టిజన్లను 10 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని సిఎండి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
జీతాలు పెంచాలని సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుండి తొలగిస్తూ విద్యుత్ సంస్థలు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశాయి.