థాయిలాండ్ డే కేర్ సెంట‌ర్ ఘ‌ట‌న: దుండ‌గుడు ఆత్మ‌హ‌త్య‌!

బ్యాంకాక్‌ (CLiC2NEWS): థాయిలాండ్‌లోని డేకేర్ సెంట‌ర్లో ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల‌లో 34 మంది మృతిచెందారు. ఆ కాల్పులు జ‌రిపిన న‌ర‌హంత‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాంపూ ప‌ట్ట‌ణంలో ఓ డే కేర్ సెంట‌ర్లో దుండ‌గుడు బ‌హిరంగ కాల్పులు జ‌రిపి మార‌ణ‌హోమం సృష్టించాడు. ఈ ఘ‌ట‌న‌లో నిండు గ‌ర్భిణి,  చిన్నారులుతో స‌హా మొత్తం 34 మంది మృత్యువాత ప‌డ్డారు. కాల్పులు జ‌రిపిన అనంత‌రం దుండ‌గుడు పాన్య ఖ‌మ్రాఫ్ అనే మాజీ పోలీస్ అధికారి త‌ప్పించుకొని పోయి త‌న కుటుంబాన్ని కూడా చంపి, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం.

1 Comment
  1. binance avis says

    Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Your email address will not be published.