తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్.. 500 ఎసి వాహనాలు ప్రారంభించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): డా. వైఎస్ ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో భాగంగా 500 ఎసి వాహనాలను ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గర్భిణిలకు సత్వర వైద్య సదుపాయం అందించేందుకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గర్బం దాల్చిన మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రసవం తర్వాత విశ్రాంతి సమయంలో సిజేరియన్‌కు రూ. 3 వేలు, సహజ ప్రసవానికి రూ. 5 వేలు అందజేస్తున్నామని, 104,108 వాహనాలతో పాటు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ తో అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సిఎం జగన్ అన్నారు.