ఆర్‌టిఐ పేరుతో రూ.50 లక్షలు డిమాండ్ చేసిన నిందితులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/arrest.jpg)
ఆదోని (CLiC2NEWS): ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆర్‌టిఐ పిటిషన్లు వేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన రఘునాథ్ ఆడివేష్ .. పట్టణంలోని మధు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకడు గుర్రెడ్డిని బెదిరించి , రూ.50లక్షలు డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులపై కూడా నిందితులు దాడికి దిగారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి , రిమాండ్ కు తరలించారు.