భార‌త్‌లో త‌మ కార్యక‌లాపాలు మూసివేస్తున్న ఆప్గాన్ ఎంబ‌సీ

ఢిల్లీ (CLiC2NEWS): న‌వంబ‌ర్ 23వ తేదీనుండి భార‌త్‌లో త‌మ దౌత్య కార్య‌క‌లాపాలు నిలిచిపోయిన‌ట్లు ఆప్గాన్ ఎంబ‌సీ ప్ర‌క‌టించింది. ఆఫ్గానిస్తాన్ గ‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఎంబ‌సీ వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ 30తోటే కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. కానీ భార‌త ప్ర‌భుత్వం నుండి ఆశించిన స‌హ‌కారం అంద‌క‌పోవ‌డంతో శాశ్వ‌త మూసివేత‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌మ‌ను ఆర్ధం చేసుకుని స‌హ‌క‌రించినందుకు భార‌త్‌లోని ఆప్గాన్ పౌరుల‌కు ఎంబ‌సీ కృత‌జ్ఞ‌తలు తెలిపింది.

ఆప్గాన్‌లోని తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని భార‌త్ ఇంకా గుర్తించ‌లేద‌ని, దేశ రాయ‌బార కార్యాల‌యానికి సంబంధించి భార‌త్ నిర్ణ‌యాలు తీసుకోలేదు. దీంతో భార‌త్ త‌మ నిర్లక్ష్యం వ‌హిస్తుంద‌ని, ఎంబ‌సీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 2021లో ఆగ‌స్టులో ఆప్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల అధికారం చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.