తాడేపల్లిలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

తాడేపల్లి (CLiC2NEWS): తాడేపల్లిలో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులు దుండగలు లాక్కెళ్లారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు సరస్వతి అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. ఆ దుండగులే కొత్తూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మరో మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్ళారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.