మన్యం జిల్లా సీతంపేట వద్ద లోయలో పడిన ఆటో..

సీతం పేట (CLiC2NEWS): 17 మంది ప్రయాణికులతో ఉన్న ఆటో లోయలో పడి ఒకరు మృతి చెందగా మిగతావారందదూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట వంబరిల్లి ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జయిపోయింది. క్షతగాత్రులు సీతం పాట ప్రాంతీయ ఆస్పత్రికి తలరించారు. అనంతరం వారిలో 10 మందిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వీరిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీతంపేట సంత పనులు పూర్తిచేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.