రోడ్డుపై వాహ‌నాల మీద‌కు దూసుకెళ్లిన బ‌స్సు..

బెంగ‌ళూరు (CLiC2NEWS):బెంగ‌ళూరులో ప్ర‌యాణికుల‌తో ఉన్న బ‌స్సు నియంత్ర‌ణ కోల్పోయి ముందున్న ప‌లు వాహ‌నాల‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో మూడు ద్విచ‌క్ర‌వాహ‌నాలు, రెండు కార్లు ధ్వంస‌మ‌య్యాయి. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన‌ట్లు స‌మాచారం. హెబ్బాల్ ఫ్లైఓవ‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న బ‌స్సు నియంత్రంణ కోల్పోవ‌డంతో డ్రైవ‌ర్ ఎంత ప్ర‌య‌త్నించిన బ్రేకులు ప‌డ‌లేదు. దీంతో బ‌స్సు ముందున్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లు బ‌స్సులో ఉన్న సిసికెమెరాల‌లో రికార్డ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.