కొండాపూర్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. యువతి మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాజధానిలోని కొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆల్యంసగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన యువతిని ఆశ్రితగా గుర్తించారు. అభిషేక్ అనే యువకుడు మద్యం మత్తులో అతివేగంగా కారును నడపటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.