భారతీయులతో ముంబయి చేరుకున్న తొలి విమానం..

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను రొమేనియా గూండా భారత్‌కు తీసుకొస్తున్న తొలి విమానం ముంబయికి చేరుకుంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి ఈ విమానం ఇండియాకు బయలు దేరింది.
రేపు ఉదయం ఢిల్లీకి మరో విమానం చేరుకోనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల నుండి హంగరీలోని బుడా పెస్ట్‌కు కొంత మంది భారత పౌరులు చేరుకున్నారు. వీరిలో ఎపికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.