86 ఏళ్ల వయసులో టెన్త్ పాస‌యిన మాజీ సిఎం

ఛండీగఢ్‌ (CLiC2NEWS): ఆయన ఒకప్పుడు  ఒక‌ రాష్ట్రానికి సిఎం.. ఇంత‌కాలం ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో టెన్త్ లో ఉత్తీర్ణుడ‌య్యాడు. ఆయ‌నే హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి ఓం ప్ర‌కాష్ చౌతాలా.. ఒక్క స‌బ్జెక్టుతో ఆయ‌న టెన్త్ అర్థంత‌రంగా ఆపేసిన ఆయ‌న ఇప్పుడు ఆ స‌బ్జెక్టులో పాస‌య్యాడు.. తాజాగా శ‌నివారం విడుద‌లైన ప‌రీక్ష ఫ‌లితాల్లో చౌతలా ఉత్తీర్ణ‌త సాధించాడు. అయితే ఇటీవ‌ల లేటు వ‌య‌సులో మ‌ళ్లీ చ‌ద‌వాల‌నిపించి.. ఓపెన్ స్కూల్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌లో జాయిన్ అయ్యారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే ఈ ఏడాది ఓపెన్ ఇంట‌ర్ స్టూడెంట్స్‌ను పాస్ చేశారు.

అయితే ఆయన పదో తరగతి పాస్‌ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఆయన ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌తో పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీష్‌ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీష్‌ 100కు 88 మార్కులు సాధించి టెన్త్ లో ఉత్తీర్ణ‌త సాధించాడు.

గ‌త ఏడాది క‌రోనా ప్రారంభ స‌మ‌యంలో ఓపెన్‌ స్కూల్‌లో చౌతలా ఇంటర్మీడియట్‌లో చేరారు. కరోనా మ‌హమ్మారి దెబ్బ‌కు పరీక్షలు రాయకుండానే ఓపెన్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణుల‌య్యారు. ఈ క్ర‌మంలో చౌతలా కూడా ఉత్తీర్ణుడ‌య్యాడు. కాగా 10వ త‌ర‌గ‌తి పాస్ అవ్వ‌కుండా ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఆయ‌న ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్‌ చౌతలా 10వ‌ తరగతి పాసవడంతో ఇంటర్‌ కూడా ఉత్తీర్ణత సాధించాడు. 86 ఏళ్ల వ‌య‌సులో వయసులో లేటెస్ట్‌గా పదో తరగతి, ఇంటర్మీడియట్ పాస‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.