రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు స‌ర్కార్‌ శుభ‌వార్త‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని అర్చ‌కుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ అందించింది. అర్చ‌కుల‌కు ఇస్తున్న గౌర‌వ‌భృతిని రూ.జ 2,500 నుండి రూ.5000 పెంచుతున్నట్లు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌క‌టించారు. శేరిలింగంప‌ల్లిలో 9 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌నాన్ని ఈ రోజు కెసిఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం వారికి గౌర‌వ భృతిని రూ. 5వేల‌కు పెంచుతున్నామ‌న్నారు. ఈ భృతిని పొందే అర్హ‌త వ‌య‌సును 65 ఏండ్ల‌కు తగ్గించారు. రాష్ట్రంలో మ‌రో 2,796 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం విస్తారింప చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తిస్తున్న 3,645 దేవాల‌యాల‌తో పాటు అధ‌నంగా మ‌రో 2,796 దేవాల‌యాల‌కు వ‌ర్తింప‌జేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద దేవాల‌యాల‌క నిర్వ‌హ‌ణ కోసం అర్చ‌కుల‌కు నెల‌కు రూ. 6వేల చొప్పున ప్ర‌భుత్వం అందిస్తుంది. ఇది రూ. 10వేల‌కు పెంచుతున్నామ‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.