హైదరాబాద్ నగరశివారులో దారుణం..
హైదరాబాద్ (CLiC2NEWS): భార్యకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ నిందితుడు అతి కిరాతకంగా భార్య తల నరికాడు. ఈ ఘటన నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జెఎన్ ఎన్‌యుఆర్ఎం కాలనీలో వినయ్, పుష్పలత దంపతులు నివాసం ఉంటున్నారు. తన భార్య పుష్పలత తల నరికి హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి పల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుష్పలతకు ఇదివరకు రెండు పెల్లిళ్లు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.