కుమార్తె కోసమైనా దంపతులను ఒక్కటిగా ఉండమని కోరిన న్యాయమూర్తి..
షాద్‌నగర్ (CLiC2NEWS): తల్లిదండ్రులు విడాకులు కావాలని కోర్టుకెళ్లారు. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారిని నీకు అమ్మ కావాలా.. నాన్న కావాలా అని న్యాయమూర్తి అడగగా.. ఆ పాప తడుముకోకుండా నాకు ఇద్దరూ కావాలంది. దీంతో చలించిపోయినా ఆ న్యాయమూర్తి ఆ చిన్నారిని అక్కున చేర్చుకుంది. కనీసం పాప కోసమైనా, ఆమె భవిష్యత్తు కోసమైనా ఆ తల్లిదండ్రులను కోరారు. కల్వకుర్త గ్రామానికి చెందిన దంపతులు తమకు విడాకులు కావాలని లోక్అదాలత్‌లో న్యాయమూర్తిని సంప్రదించారు. తల్లి వద్ద ఉంటున్న ఆరేళ్ల చిన్నారిని న్యాయమూర్తి సిఎం రాజ్యలక్ష్మి అడిగిన ప్రశ్నకు తల్లిదండ్రులిద్దరూ కావాలని కంటతడి పెట్టడంతో ఆమె చలించిపోయారు. భార్యాభర్తలు విడిపోవడం వలన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది అవగాహన కల్పించి, వారు కలిసి ఉండాలని.. ఆలోచించుకొనేందుకు 15 రోజులు వ్యవధి ఇచ్చారు.