కాబుల్ బాంబు పేలుళ్లలో 73 మంది మృతి

కాబుల్ (CLiC2NEWS): అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం భారీ పెలుడు సంభవించింది. అఫ్ఘాన్ నుంచి తమ దేశ పౌరులను ఆయా దేశాలు తరలిస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసకుంది.
ఈ ఘటనల్లో 73 మంది దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తూ..చనిపోయినవారిలో తమ మెరీన్ కమాండోలు 12 మంది, ఒక నేవీ వైద్యుడు ఉన్నట్టు అమెరికా పేర్కొంది. ఇది కచ్చితంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పెంటగాన్ వెల్లడించింది. రష్యా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది.
ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్, అమెరికా అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
పేలుడు ఘటనతో విమానాశ్రయం పరిసరాల్లో భయానక వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలను రక్షించుకోవడానికి దవఖానాకు పరుగులు పెడుతున్న క్షతగాత్రుల దృశ్యాలు బయటకొచ్చాయి. విమానాశ్రయం వద్ద ఆత్మహుతి దాడులు జరగొచ్చని అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరించిన కొన్ని గొంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
భారత్ ఖండన
కాబుల్‌లో ఉగ్రదాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటు తున్నాయని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది.
Wow, incredible weblog format! How long have you ever been blogging for? you made blogging look easy. The total glance of your website is magnificent, let alone the content!!