మ‌ద్యం మ‌త్తులో డ్రైవ‌ర్.. టోల్ ప్లాజా కౌంట‌ర్‌లోకి దూసుకెళ్లిన లారీ

నిజామాబాద్ (CLiC2NEWS): కారుని ఢీకొట్టిన ఓ లారీ టోల్ ప్లాజా కౌంట‌ర్‌లోకి దూసుకెళ్లింది. మ‌ద్యం మ‌త్తులో డ్రైవ‌ర్ ముందుగా కారును ఢీకొట్టాడు.. అనంత‌రం లారీ టోల్‌ప్లాజాలో కౌంట‌ర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ఉన్న మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. టోల్‌ప్లాజా సిబ్బంది బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలోని ఇంద‌ల్వాయి టోల్‌ప్లాజా వ‌ద్ద జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని లారీ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.