మారేడు అద్భుత‌మైంది.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

వర్షాకాలం జూన్ 14 నుండి మొదలైంది. ఈ కాలంలో ఇంట్లో మరియు బయట పెరట్లో పూల మొక్కలు, కూరగాయలు మొక్కలు, ఆకు కూరల చెట్లు ఇలాంటివి పెంచుకోవటానికి అందరు ఇష్టపడతారు. ఇది భారతీయ సంస్కృతి సంప్రాదాయంగా వస్తుంది. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.

ఇప్పుడు అలానే మనం ఒక మారేడు చెట్టు కూడా నాటుకుంటే మనకు, మన ఇంటికి, ఇంట్లో నివసించే వారికీ, మరియు మన దగ్గరికి వచ్చిపోయే బంధువులకు, ఫ్రెండ్స్ కి, అందరికి శుభసూచకంగా ఉంటుంది.

ఇప్పుడు ఆ చెట్టు గురించి చెప్పుకుందాం.

అదేనండి మారేడు చెట్టు, బిల్వ పత్రం చెట్టు, హిందీలో బెల్ పత్ర్ చెట్టు అని అంటారు. ఇది ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల రహదారుల ప‌క్క‌న‌ , మరియు చేనుల్లో, అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎక్కువగా కనపడుతుంది.

మారేడు చెట్టు ఆయుర్వేదం మందు గా, వంటిలో వున్న రోగాన్ని, ఇంట్లో వున్న దనిద్రాన్ని పోగొడుతుంది. దీనిని ఇంటి ఆవరణలో కానీ, బయట ప్రాంతంలో కానీ ఈ చెట్టు నాటితే శుభసూచకంగా ఉంటుంది. దీనిని పెంచటం వలన ఇంటి మీద వున్న నర దృష్టి, ఇతర చెడు దృష్ట శక్తులు మాటుమయం అవుతాయి. అంతే కాకుండా ఇంట్లో అందరు గొడవలు లేకుండా కలిసిమెలిసి వుంటారు.

మారేడు చెట్టు వున్న ఇంట్లో దరిద్రుడు కూడా ధనికుడు అవుతాడు అంటారు. ఇంట్లో అందరు ఆర్ధికంగా బలపడతారు. వంట్లో వున్న రోగాలు కూడా దీనిని మందుగా వాడితే పోతాయి.

ఇంట్లో వున్న సకల వాస్తు దోషాలు పఠాపంచాలు అవుతాయి. ఈ చెట్టు, ఆకులు, పండ్లు అన్నీ మంచివే. నకరాత్మకమైన ఆలోచనలు పోయి, సకరాత్మకమైన ఆలోచనలు వస్తాయి. మారేడు చెట్టు వున్న ప్రాంతంలో ఏ దుష్ట శక్తి మరియు నరదృష్టి శక్తులు పనిచేయవు. అందరు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఆధ్యాత్మికంగా వుంటారు.

-షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.