మిర్యాలగూడలో పాలట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడ్డ జనం

మిర్యాలగూడ (CLiC2NEWS): నల్గొండ జిల్లా, మిర్యాలగూడ అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై పాల ట్యాంకర్ బోల్తాపడింది. పాలన్నీ కారిపోతుండటంతో స్థానికులు వాటిని పట్టుకునేందుకు బకెట్లతో ఎగబడ్డారు. జంక్షన్‌లో స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా డ్రైవర్ వాహనాన్ని నడపడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడినట్లు తెలుస్తోంది. పాలన్నీ నేలపాలయ్యాయి. గమనించిన స్థానికులు బకెట్లు , బాటిళ్లలో పట్టుకున్నారు.