AP: మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛ‌ను జ‌మ‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): పింఛ‌ను ల‌బ్ధిదారుల‌కు శుభ‌వార్త. రాష్ట్ర ప్ర‌భుత్వం మే ఒక‌టో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛ‌ను జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో వాలంటీర్ల ద్వారా పింఛ‌ను పంపిణీ చేయ‌కూడ‌ద‌ని ఇసి ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు పింఛ‌న్ల పంపిణీ విధివిధానాల్లో మార్పులు చేసింది. స‌చివాల‌యాల‌కు వెళ్లాల్సిన ప‌నిలేకుండా బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి మే 1 నుండి 5 వ తేదీ లోపు ఇంటి వ‌ద్దే పింఛ‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

గ‌త నెలలో ఇంటివ‌ద్ద‌కే పింఛ‌ను న‌గ‌దు పంపిణీ నిలిపివేయ‌డంతో వృద్దులు స‌చివాల‌యాల‌కు వెళ్లి డ‌బ్బులు తీసుకున్నారు. కొంత‌మంది వృద్దులు పింఛ‌ను కోసం వ‌చ్చి మృతి చెందిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇంటి వ‌ద్దే పింఛ‌ను పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల‌ని అధికార, విప‌క్షాలు విజ్ఞ‌ప్తి చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇసి స్స‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.